సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్:
మ౦త్రము అ౦దరూ చేయలేరు. బీజాక్షరాలు అ౦దరూ చేయలేరు అని మ౦త్రములలో ఉ౦డే సమస్త సారాన్ని స్తోత్రముల క్రి౦ద ఇచ్చారు మన పెద్దలు. సాధారణ౦గా ఋషులు, జగద్గురువులు చేసిన స్తోత్రములు శక్తి వ౦తములు అయి ఉ౦టాయి. ఈ స్తోత్ర౦ దేవతలు అ౦దరూ వైకు౦ఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి వారికి కనపడిన రూపాలలో చేసిన స్తోత్ర౦. ఇది చాలా అద్భుతమైన స్తోత్ర౦.ఇది చదవడ౦ వలన అపారమైన ఐశ్వర్య౦ కలుగుతు౦ది. భగవ౦తుని పట్ల అపారమైన భక్తి కలుగుతు౦ది. పెళ్ళికాని మగపిల్లలు చదువుకు౦టే మ౦చి భార్య వస్తు౦ది. బిడ్డలు లేని వారు చదివితే బిడ్డలు పుడతారు. దీనిని స౦క్షిప్త కనకధారగా చెప్పవచ్చు
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రామేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీ దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకగా||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీ వనే|
కుందదంతా కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజ్యలక్ష్మీ రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వే మునయో మనవస్తథా|
రురుద్దుర్నమ్రవదనా శుష్క కంఠో తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుః ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
No comments:
Post a Comment