Monday, November 19, 2012

SIVA STUTI--MBK

‎ 


MBK

పల్లవి : 
అక్షయ లింగ విభో స్వయంభో 
అఖిలాండ కోటి ప్రభో పాహి శంభో 

అనుపల్లవి: 

అక్షర స్వరూప అమిత ప్రతాప
ఆరూఢ వృష వాహ జగన్మోహ
దక్ష శిక్షణ దక్ష-తర సుర లక్షణ
విధి విలక్షణ లక్ష్య లక్షణ
బహు విచక్షణ సుధా భక్షణ
గురు కటాక్ష వీక్షణ

చరణం:
బదరీ వన మూల నాయికా సహిత
భద్ర కాళీశ భక్త విహిత
మదన జనకాది దేవ మహిత
మాయా కార్య కలనా రహిత
సదయ గురు గుహ తాత గుణాతీత
సాధు జనోపేత శంకర
నవనీత హృదయ విభాత తుంబురు సంగీత
హ్రీంకార సంభూత హేమ గిరి నాథ
సదాశ్రిత కల్పక మహీ రుహ
పదాంబుజ భవ రథ గజ తురగ-
పదాతి సంయుత చైత్రోత్సవ
సదాశివ సచ్చిదానంద-మయ






No comments:

Post a Comment